Chintamani (play)

first publication date:  1923
original language:  Telugu

చింతామణి నాటకం తెలుగు నాట ప్రసిద్ధి చెందిన సాంఘిక నాటకం. ఇది ప్రథమాంధ్ర ప్రకరణముగా గుర్తింపుతెచ్చుకొన్నది. 20వ దశాబ్దంలోని మూడవ దశకంలోని సామాజిక సమస్యల ఆధారంగా అప్పటి కవి కాళ్లకూరి నారాయణరావు రచించిన చింతామణి నాటకం ఊరూరా నేటికీ ప్రదర్శితమవుతూనే ఉంది. ఇది వేశ్యావృత్తి దురాచారాన్ని ఖండించే నాటకం. ఈ నాటకం లీలాశుకచరిత్ర ఆధారంగా రచించబడినది. 1923 నాటికే సుమారు 446 సార్లు దేశమంతా ప్రదర్శింబడిన ఈ నాటకపు ప్రాచుర్యం తెలియుచున్నది. అత్యంత ప్రాచుర్యం పొందిన చింతామణి నాటకం తమ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందని, దీనిపై నిషేధం విధించాలని ఆర్య వైశ్య సంఘం నేతల డిమాండ్‌ మేరకు స్పందించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ నాటక ప్రదర్శనపై జనవరి, 2022లో నిషేధం విధించంది. ఈ నిర్ణ‌యం వ‌ల్ల ప‌లువురు ఉపాధి కోల్పోయార‌ని, నాట‌కాన్ని నిషేధించ‌డం వాక్‌స్వేచ్ఛ‌ను హ‌రించ‌డ‌మేన‌ని రఘురామ కృష్ణంరాజు హైకోర్టును ఆశ్ర‌యించారు. విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉత్త‌ర్వుల‌పై స్టే విధించేందుకు 2022 జూన్ 24న నిరాక‌రించింది. కాగా ఈ పిటిష‌న్‌పై త‌దుప‌రి విచార‌ణ‌ను 2022 ఆగ‌స్టు 17కు వాయిదా వేసింది. Source: Wikipedia (te)

Editions
No editions found

Work - wd:Q15700330

Welcome to Inventaire

the library of your friends and communities
learn more
you are offline